Madhuram Lyrical Video || Arjun Reddy Movie || Vijay Devarakonda, Shalini || Sandeep || Radhan ||
...
Song : Madhuram
Movie :Arjun Reddy
Lyrics:Shreshta
Singer's Sameera Bharadwaj
Music Director:Radan Label
Starring:Shalini Pandey, Vijay Devarakonda
మధురమే ఈ క్షణమే ఓ చెలి
మధురమే ఈ క్షణమే
మధురమే వీక్షణమే ఓ చెలి
మధురమే వీక్షణమే
మధురమే లాలసయే
మధురం లాలనయే
మధురమే లాహిరియే
మధురం లాలితమే
మధు పవనం వీచి
మధు పవనం వీచి
పరువమే మై మరిచిందిలే
కాలం పరుగులు ఆపి
వీక్షించె అందాలే
మోహం తన్మయమంది
శ్వాసించే గంధాలే
ఊరించి రుచులను మరిగి
ఉడికించె తాపాలే
ఉప్పొంగి ఊపిరి సెగలు
కవ్వించె దాహాలే
మౌనంగా మా మధువుల జడిలోన
పులకించే ప్రాణాలే
మధురమే ఈ క్షణమే ఓ చెలి
మధురమే ఈ క్షణమే
వీచే గాలులు దాగి
చెప్పేనే గుసగుసలే
చూసీ ముసిముసి నవ్వులు
చేసే బాసలనే
వశమై ఆనందపు లోగిట
ఆరోధించి ఆకాశం
సగమై సాగరమంది
అగూపించే ఆశాంతం
తీరం ముడివేసిన దారం
తీర్చే ఎద భారం
మధురమే ఈ క్షణమే ఓ చెలి
మధురమే ఈ క్షణమే
మధురమే వీక్షణమే ఓ చెలి
మధురమే వీక్షణమే
మధురమే లాలసయే
మధురం లాలనయే
మధురమే లాహిరియే
మధురం లాలితమే
మధు పవనం వీచి
మధు పవనం వీచి
పరువమే మై మరిచిందిలే
*****

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి