Edo Jaruguthondi Edhalo alajadi Song Lyrics

               Play This Song Online


Song: Edo Jarugutondi
Cast: Varun Tej, Sai Pallavi


Singer: Aravind Srinivas, Renuka

Lyrics: Sirivennela Seetharama Sastry

Music: Shakthikanth Karthick


తనలో ఉన్నదేదో ఎదురుగానే ఉన్నది 
అయినా మనసు దాన్ని పోల్చలేకున్నది

తానే వెతుకుతోంది దొరికినట్టే ఉన్నది 
అయినా చెయ్యి చాచి అందుకోకున్నది



రమ్మంటున్నా...... పొమ్మంటున్నా....
వస్తూ ఉన్నా....  వచ్చేస్తున్నా....



ఏదో జరుగుతోంది ఎదలో అలజడీ 
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ

ఏదో జరుగుతోంది ఎదలో అలజడీ 
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ

గుండెలో ఇదేమిటో కొండంత ఈ భారం 
ఉండనీదు ఊరికే యే చోట ఏ నిమిషం



వింటున్నావా..... నా మౌనాన్నీ....
ఏమో ఏమో... చెబుతూ ఉందీ....



ఏదో జరుగుతోంది ఎదలో అలజడీ 
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ

ఏదో జరుగుతోంది ఎదలో అలజడీ 
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ



కరిగిపోతు ఉన్నది ఇన్నాళ్ల ఈ దూరం
కదలి పోను అన్నది కల లాంటి ఈ సత్యం



నా లోకంలో... అన్నీ ఉన్నా....
ఎదో లోపం నువ్వే నేమో....

ఆ పై దూరం....ఏం లేకున్నా....
సందేహంలో ఉన్నావేమో....



ఏదో జరుగుతోంది ఎదలో అలజడీ 
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ

తనలో ఉన్నదేదో ఎదురుగానే ఉన్నది 
అయినా మనసు దాన్ని పోల్చలేకున్నది



ఏదో జరుగుతోంది ఎదలో అలజడీ 
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ

ఏదో జరుగుతోంది జరుగుతోంది...
ఎదలో అలజడీ  అలజడీ..
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ...
*****

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The Breakup Song With Telugu Lyrics || Arjun Reddy Movie|| Vijay Devarakonda, Shalini || Sandeep

Native Place Song Lyrics || Hello Guru Prema Kosame Movie Song Lyrics || Ram Pothineni, Anupama || DSP

ఒకే ఒక లోకం నువ్వే లిరిక్స్ | Okey Oka Lokam Lyrics – Sashi (2021) | Best of Sid Sriram